![]() |
![]() |
.webp)
ఫ్యామిలీ స్టార్స్ షో ప్రతీ వారం ఫుల్ జోష్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. ఇక ఈ వారం షో ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో వర్ష, ఇమ్ము కామెడీ మాములుగా లేదు. ఇమ్ము ఐతే కౌంటర్ లు పేల్చాడు. వర్షతో పాటు రీతూ మీద కూడా కామెడీ చేసాడు. ఇంతకు ముందు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా ఒక సెగ్మెంట్ పెట్టారు. అందులో రష్మీ ఇల్లు, ఇంద్రజ ఇల్లు అంటూ చూపించారు. ఇప్పుడు అలాంటిదే ఒకటి ఫామిలీ స్టార్స్ కూడా సెగ్మెంట్ పెట్టారు. అందులో ఇమ్ము వర్షను, రీతూను గుడిసెలను చూపించాడు. "హాయ్ ఫ్రెండ్స్ ఇది గుడిసె ..సో ఈ గుడిసె ఎవరిదో కాదు ఫ్రెండ్స్ మన వర్షది..ఆర్టిస్ట్ కాక ముందు వర్ష ఈ గుడిసెలోనే ఉండేది..వర్షకి అవకాశాలు వచ్చి వెళ్ళిపోయాక..రీతూ రెంట్ కి తీసుకుంది ఫ్రెండ్స్ " అనేసరికి రీతూ షాకయ్యింది.

అసలు రీతూ, వర్ష ఇలాంటి గుడిసెల్లో ఉంటారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫాన్స్, నెటిజన్స్. ఈ మధ్య సుధీర్ ఫామిలీ స్టార్స్ కి హోస్ట్ గా చేస్తూ తన ఫాన్స్ ని మెప్పిస్తున్నాడు. ఈ ప్రోమో కింద కామెంట్స్ అన్నీ కూడా జై సుధీర్ అంటూనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందులో భానుశ్రీ, స్రవంతి అప్సరసల్లా వచ్చి ఎంటర్టైన్ చేశారు. స్టార్టింగ్ షో మొత్తం కూడా బిందాస్ గా నడిచింది కానీ లాస్ట్ లో మాత్రం కన్నీళ్లు పెట్టించేసింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.
![]() |
![]() |